ఇటీవల మృతి చెందిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలో గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడిన ముఖ్యమంత్రి.. గౌతమ్ రెడ్డి అకాల మరణం తననను కలచివేసిందని తెలిపారు. గౌతమ్ రెడ్డి తనకు చిన్నప్పటి నుంచి తెలుసనీ, ఆయన మరణం పార్టీకి, ప్రభుత్వానికి తీరని లోటని వ్యాఖ్యానించారు.
అనేక సందర్భాల్లో తనకు అండగా నిలబడిన గౌతమ్, పరిశ్రమల మంత్రిగా చాలా కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. సంగం బ్యారేజీ పనులను ఆరు నెలల్లోగా పూర్తి చేసి దానికి దివంగత మంత్రి పేరు పెడతామని ప్రకటించారు.