భారత బౌలర్లపై గవాస్కర్ కామెంట్స్.. ఒక్కడు కూడా లేడు.. - MicTv.in - Telugu News
mictv telugu

భారత బౌలర్లపై గవాస్కర్ కామెంట్స్.. ఒక్కడు కూడా లేడు..

June 13, 2022

”భారత పర్యటనను దక్షిణాఫ్రికా జట్టు తెగ ఆస్వాదిస్తోంది. ఏ మాత్రం పసలేని భారత బౌలింగ్‌ను సునాయాసంగా ఎదుర్కొంటూ, వరుసగా రెండు టీ20ల్లో విజయం సాధించింది. భారత బౌలర్లు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ఏ మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. భువనేశ్వర్ కుమార్ ఒక్కడే రెండు మ్యాచుల్లో కట్టడి చేస్తూ, బౌలింగ్ చేయగలిగాడు. ఈ మ్యాచ్‌ల్లో ఎక్కువ వికెట్లు తీసింది కూడా అతడే. రెండో టీ20లో నాలుగు ఓవర్లకు నాలుగు వికెట్లు తీశాడు. అయినా, మిగిలిన బౌలర్లలో ఏమాత్రం పసలేదు. భువనేశ్వర్ లాంటి బౌలర్ ఒక్కడు కూడా లేడు.” అని మాజీ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా మండిపడ్డారు.

తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో భారత బౌలర్లు తీవ్రంగా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్‌పై ఒత్తిడి తీసుకురాలేక నానా అవస్థలు పడ్డారు. మ్యాచ్‌లను వీక్షించిన అభిమానులకు తీరని నిరాశను కల్గించారు. ఈ క్రమంలో సునీల్ గవాస్కర్ భారత బౌలర్ల తీరుపై ఆగ్రహ వ్యక్తం చేస్తూ, సంచలన కామెంట్స్ చేశారు. ”మిగిలిన మూడు మ్యాచులలోనైనా ఉమ్రాన్ మాలిక్‌కు ఇండియా అవకాశం ఇచ్చి తీరాలి. నేను చూడ్డానికి ఇష్టపడే ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ తర్వాత రెండో ఆటగాడు ఉమ్రాన్ మాలికే’ అని ఆయన అన్నారు.