డొనాల్డ్‌ ట్రంప్‌తో సునీల్‌ గావస్కర్‌ భేటీ - MicTv.in - Telugu News
mictv telugu

డొనాల్డ్‌ ట్రంప్‌తో సునీల్‌ గావస్కర్‌ భేటీ

August 23, 2019

Gavaskar meets President Trump on Charity

భారత మాజీ క్రికెటర్, లిటిల్ మాస్టర్ సునీల్‌ గావస్కర్‌ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తరువాత కామెంటేటర్‌గా కెరీర్ కొనసాగిస్తున్నారు. అలాగే పలు చారిటీ సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కలిశారు. న్యూయార్క్‌లోని ట్రంప్‌ బెడ్‌మినిస్టర్‌ గోల్ఫ్‌ కోర్స్‌లో ట్రంప్‌తో గావస్కర్‌ భేటీ అయ్యారు. ఓ ఛారిటీ ఫౌండేషన్‌ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ట్రంప్‌కు వివరించారు. 

విరాళాల సేకరణ, హార్ట్‌ టు హార్ట్‌ ఫౌండేషన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో కోసం గావస్కర్‌ అమెరికా వెళ్లారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు ముంబయిలోని శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్‌ సహకారంతో ఈ ఫౌండేషన్‌ ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయిస్తోంది. న్యూజెర్సీ, అట్లాంటాలో నిర్వహించిన విరాళాల సేకరణ కార్యక్రమాల్లో గవాస్కర్ పాల్గొని సుమారు 230 మంది చికిత్సకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని  సాధించారు.