పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు ‘గే’.. ప్రేమించి వంచించాడని - MicTv.in - Telugu News
mictv telugu

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు ‘గే’.. ప్రేమించి వంచించాడని

February 28, 2020

Gay

ప్రేమ,పెళ్లి పేరుతో తనను ఓ యువకుడు మోసం చేశాడని ఓ స్వలింగ సంపర్కుడు  పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లి పేరుతో నిశ్చితార్థం చేసుకొని శారీరకంగా వాడుకున్న తర్వాత వదిలేసి వెళ్లిపోయాడని ఫిర్యాదు చేశాడు. మరో యువతితో పెళ్లి చేసుకున్నాడని తనకు న్యాయం చేయాలని పేర్కొన్నాడు. ఈ ప్రేమ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 

జీడిమెట్ల షాపూర్‌నగర్‌కు చెందిన ముదాంగుల్ల శ్రీను అలియాస్‌ లక్కీ రాయ్‌ (గే) బంజారాహిల్స్‌ రోడ్‌ నం.1లో ప్రైవేట్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇతనికి 2017లో అత్తాపూర్‌కు చెందిన ఎండి ఫెరోజుద్దీన్‌ ఫేస్‌బుక్‌లో  స్నేహం ఏర్పడింది. కొంత కాలం తర్వాత శ్రీనును ప్రేమిస్తున్నానంటూ ఫిరోద్దిన్ చెప్పాడు. ఆ తర్వాత 2018 జూలై 8న ఇద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. గోవాకు వెళ్లి ముందస్తుగా హనీమూన్‌ చేసుకున్నారు. తీరా పెళ్లి చేసుకునే సమయం వచ్చే సరికి కనిపించకుండా పోయాడు. కొన్ని రోజులకు ఓ యువతితో నిశ్చితార్థం ఫోటో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై శ్రీను ఆరాతీయగా దాటవేసే ప్రయత్నం చేసి ఈ నెల 14న ఫెరోద్దీన్ పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన శ్రీను తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నాడు.