స్వలింగ సంపర్కుల వివాహ చట్టం కావాలని కోర్టులో పిటిషన్! - MicTv.in - Telugu News
mictv telugu

స్వలింగ సంపర్కుల వివాహ చట్టం కావాలని కోర్టులో పిటిషన్!

November 25, 2022

ప్రత్యేక వివాహ చట్టం కింద స్వలింగ వివాహాన్ని గుర్తించాలని కోరుతూ హైదరాబాద్ కి చెందిన స్వలింగ సంపర్కులు, మరొక జంట దాఖలు చేసిన రెండు పిటిషన్ల పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ చేపట్టనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ముందు ఈ పిటిషన్లు విచారణకు లిస్ట్ చేయబడ్డాయి. హైదరాబాద్‌ లో నివసిస్తున్న ఇద్దరు స్వలింగ సంపర్కులు సుప్రియో చక్రవర్తి, అభయ్ డాంగ్ చేసిన లీడ్ పిటిషన్‌లో.. తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు ఎల్‌జిబిటిక్యూ+ పౌరులకు కూడా వర్తిస్తుందని పేర్కొంది.

సుప్రియో, అభయ్ కలిసి ఉండబట్టి దాదాపు 10 ఏళ్లు అయ్యింది. కోవిడ్ మహమ్మారి రెండవ వేవ్ సమయంలో వారిద్దరికీ కోవిడ్ వచ్చింది. ఆ సమయంలో వారి బంధం మరింత బలపడింది. వారు కోలుకున్న తర్వాత వారి బంధాన్ని అందరికీ తెలియచేయాలనుకున్నారు. 9వ వార్షికోత్సవంలో వివాహ-కమిట్మెంట్ వేడుకను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. డిసెంబరు 2021లో వారి తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితుల సమక్షంలో వేడుక చేశారు. ఈ వేడుకను కన్నుల పండుగగా జరుపుకొన్నారు. అయితే.. ఇలా ఉన్నప్పటికీ, వారు వివాహిత జంట హక్కులను అనుభవించడం లేదని పిటిషన్‌లో పేర్కొంది.

మొదటి పిటిషన్..

కులాంతర, మతాంతర జంటలు తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కును భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ఎల్లప్పుడూ పరిరక్షిస్తుందని పిటిషనర్లు వాదించారు. అంతేకాదు.. స్వలింగ వివాహాలు ఈ రాజ్యాంగం ఆమోదించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. వీరి పిటిషన్లో కొన్ని కేసులను కూడా ఉదహరించారు. అవి.. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 377ను రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసిన నవతేజ్ సింగ్ జోహార్ కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై పిటిషన్లు ఆధారపడి ఉన్నాయి. ఎల్‌జిబిటిక్యూ+ వ్యక్తులు రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వం, గౌరవం, గోప్యత హక్కును ఇతర పౌరులందరితో సమానంగా అనుభవిస్తున్నారని పుట్టస్వామి కేసులో సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ పిటిషన్‌ ను న్యాయవాదులు అరుంధతీ కట్జూ, ప్రియా పూరి, సృష్టి బోర్తకూర్ రూపొందించారు. సీనియర్ న్యాయవాదులు నీరజ్ కిషన్ కౌల్, మేనకా గురుస్వామిలు వాదించనున్నారు.
రెండవ పిటిషన్..
స్వలింగ వివాహాలను గుర్తించకపోవడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం నాణ్యత హక్కు, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును ఉల్లంఘిస్తుందని వాదిస్తూ స్వలింగ సంపర్కుల జంట పార్త్ ఫిరోజ్ మెహ్రోత్రా, ఉదయ్ రాజ్ రెండవ పిటిషన్ దాఖలు చేశారు. ‘పిటిషనర్లు.. స్వలింగ జంట. వారు ఒకరికొకరు, వారి పిల్లలకు ఆచరణాత్మక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. వారి ప్రాథమిక హక్కును తిరస్కరించడం పిటిషనర్లు రాజ్యాంగ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించినట్లే’ అని న్యాయ సంస్థ కరంజావాలా అండ్ కో ద్వారా దాఖలు చేసిన పిటిషన్ పేర్కొంది. వీరి తరుపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, సౌరభ్ కిర్పాల్ హాజరవుతారు.