భారతీయ భాషల్లో రాసిన నవలకు అంతర్జాతీయ పురస్కారం దక్కింది. ఢిల్లీకి చెందిన భారత రచయిత్రి గీతాంజలి శ్రీ రచించిన హీం నవలకు బుకర్ ప్రైజ్ లభించింది. ఆమె రాసిన రేత్ సమాధి(2018).. ఆంగ్ల అనువాదం ‘టాంబ్ ఆఫ్ శాండ్’కు 2022కుగానూ ఇంటర్నేషనల్ అవార్డ్ దక్కింది. భారతీయ భాషలో ఈ అవార్డు గెలుచుకున్న మొదటి పుస్తకం ఇదే. హిందీ నుండి అనువదించబడిన మొదటి నవల ఇది. అంతేకాదు బుకర్‌ప్రైజ్ గౌరవం అందుకున్న తొలి భారత రచయిత్రి ఈమెనే.
గురువారం లండన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో గీతాంజలి శ్రీ(64)కి బుకర్ ప్రైజ్‌ను అందజేశారు. గీతాంజలితో పాటు రేత్ సమాధిని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసిన డైకీ రాక్వెస్(అమెరికా)కు కలిపి ఈ పురస్కారం దక్కింది. అవార్డు కింద మెడల్ తోపాటు యాభై వేల బ్రిటిష్ స్టెర్లింగ్ పౌండ్లను సైతం క్యాష్ ప్రైజ్‌గా అందించారు.
ఉత్తరభారతానికి చెందిన ఓ 70ఏళ్ల వృద్దురాలి ఇతివృత్తంలో గీతాంజలి రేత్ సమాధి(టూంబ్ ఆఫ్ సాండ్) నవల రాశారు. 70 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయిన వృద్ధురాలు కుంగుబాటుకు గురైన తర్వాత ఆమె జీవితంలో చోటుచేసుకున్న కొత్త మార్పులేంటి అనేదే ఈ కథకు మూలం. కాగా, రేత్ సమాధి నవలకు బుకర్ ప్రైజ్ వస్తుందని కలలలో కూడా ఊహించలేదని నవాలాకారిణి గీతాంజలి శ్రీ అన్నారు.