Gehlot gave clarity..they will not compete
mictv telugu

క్లారిటి ఇచ్చిన గెహ్లాట్‌..వాళ్లు పోటీ చేయరు

September 23, 2022

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తాజాగా అధ్యక్ష పదవికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే, ఈ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ కుటుంబ నుంచి ఎవరు పోటీ చేయటం లేదని తాజాగా రాహుల్ గాంధీ ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. దాంతో రాజస్థాన్ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, శశిథరూర్, దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ వంటి పలువురు సీనియర్ నేతలు అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి సిద్దమైయ్యారు.

ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీగార్లే ఉండాలని డిమాండ్ చేస్తూ, గతకొద్ది రోజులుగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఇటువంటి సమయంలో అశోక్ గెహ్లాట్ ఈరోజు ఓ కీలక విషయాన్ని మీడియా ముందు వెల్లడించారు.

 

”కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ తిరిగి బాధ్యతలు చేపట్టాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని నేను కూడా ఆయనకు చెప్పాను. ఆయనను ఒప్పించేందుకు పలుమార్లు ప్రయత్నించాను. కానీ, రాహుల్ దానిని తిరస్కరించారు. నేను అధ్యక్ష పదవి చేపట్టాలని వారు కోరుకుంటున్నారని నాకు తెలుసు. నేను వారి ఆకాంక్షను గౌరవిస్తాను. కానీ, గాంధీయేతరులు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. పార్టీ తదుపరి అధ్యక్షుడిగా గాంధీ కుటుంబం నుంచి ఎవరు ఉండకూదని నిర్ణయం తీసుకున్నాను” అని రాహుల్ తనతో చెప్పారని గెహ్లాట్ వెల్లడించారు.

మరోపక్క ఈ అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించి, నిన్న నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబరు 1న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. వాటి ఉపసంహరణకు అక్టోబరు 8 వరకు గడువు ఇచ్చారు. పోటీలో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్ధులుంటే అక్టోబరు 17న ఓటింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత అక్టోబరు 19న ఫలితాలను వెల్లడిస్తారు.