Gentlemen Agreement Between The Two Fishermen Groups Over The Ring Net Dispute
mictv telugu

రింగు వలల వివాదం.. ఒప్పందం కుదిర్చిన మంత్రి

July 30, 2022

Gentlemen Agreement Between The Two Fishermen Groups Over The Ring Net Dispute
విశాఖపట్నంలో మత్స్యకారుల మధ్య మరోసారి రింగు వలల వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున వాసవానిపాలెంలో రింగు వలలతో కూడిన పడవలకు నిప్పు పెట్టడం, ఇది పెద్దజాలరిపేటకి చెందిన మత్స్యకారులే పనే అయ్యుంటుందని వారి మూడు పడవల్ని తీసుకురావడంతో వివాదం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. మత్స్యకార పెద్దలతో ఈ వివాదాన్ని పరిష్కరించి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. మత్స్యకార గ్రామాల పెద్దలతో మంత్రి సీదిరి అప్పల రాజు సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున, పోలీస్ ఉన్నతాధికారులు, ఇరు వర్గాల మత్స్యకారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో రింగ్‌ వలలు ఉపయోగించేందుకు లైసెన్స్‌లు కలిగిన పడవలను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. అలాగే నిర్దేశించుకున్న సరిహద్దులను అతిక్రమించవద్దని మంత్రులు, అధికారులు మత్స్యకారులకు సూచించారు. ఇందు కోసం అవసరమైన పర్యవేక్షణ చేపట్టాలని పోలీసులు, మత్స్యశాఖ అధికారులను మంత్రులు ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించిన రింగు వలల వినియోగ దారులపై చర్యలు తప్పవన్నారు. నిజంగా గట్లపై చర్యలు తీసుకుంటే ఇరు వర్గాలకు కష్టం అవుతుందన్నారు. జెంటిల్‌మెన్‌ ఒప్పందం ప్రకారం సంప్రదాయ మత్స్యకారులు, రింగ్‌ వలల మత్స్యకారులు వేట కొనసాగిస్తారని మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. కొత్త సమస్యలు తలెత్తకుండా…ఆయా గ్రామాల్లో మత్య్సకారులు సామరస్యంగా చర్చించుకోవాలన్నారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా…మంచి పరిష్కారం సూచించామన్నారు. బోట్లు కాల్చివేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.