వాటిని తాకడం ఆయన అలవాటు - MicTv.in - Telugu News
mictv telugu

వాటిని తాకడం ఆయన అలవాటు

October 27, 2017

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్‌ సీనియర్‌‌పై లైంగిక వేధింపులు వివాదం కొనసాగుతూనే ఉంది.  90 ఏళ్లు దాటిన పండుముసలితనంలోనూ ఆయన  తమను లైంగికంగా వేధించారని ముగ్గురు మహిళలు ఆరోపించారు.

దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నష్ట నివారణ కోసం ఆయన కార్యాలయం రంగంలోకి దిగింది. ఆయనగారి చేష్టలను సమర్థించుకుంటూ వివరణ ఇచ్చింది.

ముఖ్యంగా..  జార్జిబుష్  దురుద్దేశంతో తన పిరుదులు  తాకారని నటి జోర్డానా గ్రోల్నిక్‌ చేసిన ఆరోపణలకు బదులిచ్చింది. ‘సీనియర్  బుష్‌ వయసు 93 ఏళ్లు.  ఐదేళ్లుగా ఆయన వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు.   సాధారణంగానే బుష్ చేతులు పక్కన నుంచున్న వారి వీపు కిందకు వస్తాయి. ఈ క్రమంలో పిరుదులను  తాకడాన్ని కొంతమంది  దురుద్దేశంగా భావిస్తారు. ఒకవేళ ఎవరైనా ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆయన వెంటనే క్షమాపణ చెప్పేస్తారు. ఏదో రిలీఫ్ కోసం ఆయన అలా చేస్తుంటారు కనుక దయచేసి అపార్థం చేసుకోకండి’ అని బుష్ కార్యాలయం చెప్పుకొచ్చింది. బుష్ అప్పుడప్పుడూ మహిళల పిరుదులను తడిమే మాట నిజమేనని, సదుద్దేశంతోనే అలా చేస్తుంటారని పేర్కంంది.