నల్లజాతి నిరసనలు హింసాత్మకం..పోలీసులపై కాల్పులు - MicTv.in - Telugu News
mictv telugu

నల్లజాతి నిరసనలు హింసాత్మకం..పోలీసులపై కాల్పులు

June 2, 2020

అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా కొద్దిరోజులుగా ఆందోళనలు చెలరేగుతోన్న సంగతి తెల్సిందే. తాజాగా ఈ ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. కొందరు నిరసనకారులు ఏకంగా పోలీసులపై దాడులకు దిగారు. సోమవారం రాత్రి సెయింట్ లూయిస్‌లో ఓ నిరసనకారుడు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు గాయపడ్డారు.

అల్లర్లను నియంత్రిండంలో భాగంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపినట్టు సెయింట్ లూయిస్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు బుల్లెట్లు తగిలినట్లు నిర్ధారించారు. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. నలుగురికీ ప్రాణాపాయం తప్పినట్లు డాక్టర్లు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.