దుమ్ములేపుతున్న బుల్లెట్ పాప..! - MicTv.in - Telugu News
mictv telugu

దుమ్ములేపుతున్న బుల్లెట్ పాప..!

November 7, 2019

యూట్యూబ్‌లో బుల్లెట్ సాంగ్ దుమ్ములేపుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ విప్లవ కెరటం జార్జిరెడ్డి జీవితం ఆధారంగా అతని పేరుతోనే తెరెక్కిన బయోపిక్ ‘జార్జిరెడ్డి’ సినిమా కోసం ఈ పాటను చిత్రీకరించారు. ప్రముఖ గాయని మంగ్లీ ఈ పాటను ఆలపించారు. ‘వాడు నడిపే బండీ రాయల్ ఎన్‌ఫీల్డు.. వాడి చూపుల్లో ఉందీ చెగువేరా ట్రెండు’ అంటూ సాగే ఈ పాట ప్రోమో యూత్‌ను ఉర్రూతలూగిస్తుంది. ప్రోమో విడుదలైన కొన్ని గంటల్లోనే ఎంతో మందిని ఆకట్టుకుంది. 

1970 కాలం నాటి రోజులను గుర్తు చేసేలా ఉన్న కాస్ట్యూమ్స్, పాట చిత్రీకరణ అద్భుతంగా తీశారు. జార్జిరెడ్డి గర్ల్‌ఫ్రెండ్‌పై చిత్రీకరించిన ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ అందించారు. గాయని మంగ్లీ తనదైన జోష్‌తో ఈ సాంగ్ ఆలపించారు. ఈ నెల 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు ‘దళం’ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ టైటిల్ రోల్ పోషించగా..సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. మైక్ మూవీ బ్యానర్‌పై అన్నపరెడ్డి అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.