ఐదు సాంగ్స్‌తో 'జార్జిరెడ్డి' జ్యూక్ బాక్స్ విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

ఐదు సాంగ్స్‌తో ‘జార్జిరెడ్డి’ జ్యూక్ బాక్స్ విడుదల

November 20, 2019

George reddy movie juke box got released in youtube.

ఉస్మానియా విద్యార్థి నేత జార్జిరెడ్డిపై తీసిన బయోపిక్ ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది. దీంతో సినిమా యూనిట్ జోరుగా ప్రమోషన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆడియో జ్యూక్ బాక్స్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ జ్యూక్ బాక్స్ లో మొత్తం ఐదు పాటలున్నాయి.

దాదాపు 5 దశాబ్దాల కిందట జార్జిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అతడు విద్యార్థుల్లో రగిలించిన చైతన్యాన్ని కళ్లకు కడుతూ ఈ సినిమాను రూపొందించారు. ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల సమస్యలపైనే కాకుండా రైతులు, ఇతర బడుగుబలహీన వర్గాలకు న్యాయం కోసం జార్జిరెడ్డి పడిన తపనను సినిమాలో చూపించారు. ఆనాటి రాజకీయాలను, ఆందోళనలను, విద్యార్థుల పోరాటాన్ని అద్భుతంగా తేరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన జార్జి రెడ్డి ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మైక్ మూవీస్ బ్యానర్‌పై అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి ‘దళం’ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించగా, ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ టైటిల్ రోల్ పోషించారు. ఈ నెల 22న చిత్రం విడుదల కానుంది.