నవంబర్ 22న 'జార్జిరెడ్డి' విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

నవంబర్ 22న ‘జార్జిరెడ్డి’ విడుదల

October 24, 2019

George reddy releasing on november 22

‘స్కాలర్‌షిప్పులు రాకున్నా, ఏం చేసినా  గల్లా పట్టుకుని ప్రశ్నించండి.. రైజ్ యువర్ వాయిస్.. జీనా హైతో మర్‌నా సీఖో’ అంటూ మన ముందుకొచ్చాడు జార్జిరెడ్డి. అన్యాయాలపై పోరాడుతూ, అక్రమాలను ప్రశ్నిస్తూ ‘ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్’లా జూలు విదిల్చాడు. ఉస్మానియా విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవితం ఆధారంగా బయోపిక్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్‌ ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ‘జార్జిరెడ్డి’ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. నవంబర్ 22న జార్జిరెడ్డి ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

ఈ చిత్రానికి ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. జార్జిరెడ్డి పాత్రలో ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ నటించారు. ఈ చిత్రానికి మైక్ మూవీస్ అధినేత అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మాణ సారథ్యం వహించారు. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

సిల్లీ మాంక్స్ స్టూడియోస్, 3 లైన్స్ మూవీస్, దాము రెడ్డి, సుధాకర్ యక్కంటి నిర్మాణ సహకారం అందించారు. ఈ సినిమా ఆడియో వేడుకను త్వరలో నిర్వహించేందుకు చిత్ర బృందం రెడీ అవుతోంది. ఈ వేడుకకు సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని సమాచారం.