Georgia woman praised for honesty after finding over $500 in KFC order
mictv telugu

శాండ్‌విచ్ ఆర్డర్ చేస్తే డబ్బు కట్ట వచ్చింది.. ఆమెకు నిజాయతీ మరీ ఎక్కువై..

September 23, 2022

ఆకలితో ఉన్న ఆ మహిళ తన వెంట తెచ్చునున్న పార్శిల్‌ కవర్ ను ఓపెన్ చేసింది. ఆ కవర్ లో చికెన్ శాండ్‌విచ్‌కు బదులు నోట్ల కట్టలు ఉండడంతో ఒక్కసారిగా షాకైంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. అమెరికా లోని జార్జియా రాష్ట్రానికి చెందిన జోన్నే ఆలివర్.. తాజాగా ఓ పని మీద కారులో బయటకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు బాగా ఆకలేసింది. ఏదైనా తిందామనే ఉద్దేశంతో.. దారిలో కనిపించిన కేఫ్‌సీ రెస్టారెంట్‌కు వెళ్లి, అక్కడ చికెన్ శాండ్ విచ్‌ను ఆర్డర్ చేసింది. అనంతరం పార్శల్ కవర్ తీసుకుని.. తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. కారులో వెళ్తున్న క్రమంలోనే శాండ్‌విచ్ తినేందుకు పార్శిల్‌ను ఓపెన్ చేసింది. పార్శిల్‌లో శాండ్‌విచ్‌తో పాటు సుమారు రూ.43వేల విలువగల యూఎస్ డాలర్లు ఉండటంతో కంగుతింది. తర్వాత షాక్ నుంచి బయటకు వచ్చిన ఆమె.. కీలక నిర్ణయం తీసుకుంది. అప్పుల్లో ఉండి కూడా ఆ డబ్బును తన అవసరాలకు వినియోగించుకోకూడదని భావించింది. వెంటనే పోలీసులను సంప్రదించి.. ఆ మొత్తాన్ని అధికారులకు అప్పగించింది. ఆ డబ్బు రెస్టారెంట్ యొక్క ఆ రోజు వచ్చిన ఆదాయమని, కౌంటర్ వద్ద పొరపాటున మేనేజర్ ఆమె పార్శిల్ కవర్లో వేసినట్లు తెలిసింది.