‘ప్రేమ పంట’ పండించాడు.. ఆమెను గెల్చుకున్నాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

‘ప్రేమ పంట’ పండించాడు.. ఆమెను గెల్చుకున్నాడు..

February 14, 2020

German Man.

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో ప్రియురాలిని పెళ్లి చేసుకోవడం కోసం సిద్ధార్థ వ్యవసాయం చేసి తన ప్రేమను గెలిపించుకుంటాడు. అలాంటిదే నిజ జీవితంలోనూ జరిగింది. ఓ వ్యక్తి తన ప్రేమను వ్యక్త పరిచేందుకు వ్యవసాయం చేశాడు. చేనులో మొక్కజొన్న పంట వేసి దాని ద్వారా తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. జర్మనీలో జరిగిన ఈ వింత ప్రేమకథ ఈ వాలంటైన్స్‌డే రోజు విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 

స్టీఫెన్‌ స్క్వార్జ్‌ అనే వ్యక్తి తన ప్రేమను వినూత్నంగా ప్రియురాలికి చెప్పాలని అనుకున్నాడు. వెంటనే ఓ ఆలోచన చేసి తన పొలంలో పంట ద్వారా వ్యక్త పరచాలని సిద్ధమయ్యాడు. వెంటనే ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అనే అర్థం వచ్చేలా మొక్కజొన్న గింజలను నాటాడు. అవి పెరగగానే ఏరియల్ వ్యూ ద్వారా గుగూల్ మ్యాప్ ద్వారా చిత్రాలను తీశాడు. జర్మనీ భాషలో కనిపించే ఈ అక్షరాలను అక్కడి జనాలను ఎంతగానో అబ్బుపరిచింది. ఇలా తన ప్రేమను ప్రియురాలికి వెల్లడించాడు. దీంతో అతడి ప్రపోజల్ పెళ్లి వరకూ వెళ్లింది. స్టిఫెన్ స్క్వార్జ్ తన ప్రియురాలిని జూన్‌లో పెళ్లి చేసుకునేందుకు ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు. 

సాధారణంగా అయితే ప్రేమికులు తమ ప్రేమను వ్యక్త పరిచేందుకు వింత వింత మార్గాలను ఎంచుకుంటారు. సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం, గిఫ్టుల రూపంలో ఇచ్చి తమ ప్రేమను చెబుతారు. కానీ ఇలా పంటను పొలంలో వైరైటీగా ప్రపోజ్ చేయడం అందరిని ఆకట్టుకుంది.