ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి ఆ ఒక్కడిని పంపేశారు..
ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో 55 రోజులుగా ఒంటరిగా బతుకీడుస్తున్న జర్మనీ నేరగాడికి విముక్తి దొరికింది. అతణ్ని ఈ రోజు కేఎల్ఎం విమానంలో ఆమ్‌స్టర్‌డామ్‌కు పంపేశారు. కరోనా పరీక్ష నిర్వహించి నెగిటివ్ రావడంతో.. ‘ఊరికే గోళ్లు గిల్లుకుంటూ ఎందుకు పడుంటావ్. పైగా నీకు తిండి దండగ.. ఇక వెళ్లు నాయనా.. ’ అని విమానం ఎక్కించేశారు.
ఎడ్గార్డ్ జీబాట్ అనే ఆ వ్యక్తి మార్చి 18న హనోయ్ నుంచి ఇస్తాంబుల్‌కు వెళ్తూ దారిమధ్యలో ఢిల్లీలో చిక్కుకుపోయాడు. కరోనా వైరస్ కారణంగా టర్కీ విమానాలను అన్నింటిని రద్దు చేశారు. ఆ వెంటనే లాక్‌డౌన్ విధించారు. దాంతో చాలా మంది ప్రయాణికులు ఇరుక్కుపోయారు. వారందరికి జర్మనీ రాయబార కార్యాలయం క్వారంటైన్ ఏర్పాటు చేసింది. కానీ జీబాట్‌కు ఉన్న నేర చరిత్ర కారణంగా సాయం చేయడానికి నిరాకరించారు. వీసా ఇచ్చేందుకు భారత్ కూడ నిరాకరించింది. చేసేదేమిలేక లగేజీతో సహా ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయాడు. రోజై న్యూస్ పేపర్లు చదువుతూ.. ఇంట్లో వాళ్లతో ఫోన్ మాట్లాడుతూ.. కాలం గడిపేశాడు.