సమరం మనది అయితే.. జార్జిరెడ్డి వీడియో సాంగ్.. - MicTv.in - Telugu News
mictv telugu

సమరం మనది అయితే.. జార్జిరెడ్డి వీడియో సాంగ్..

November 13, 2019

విప్లవ విద్యార్థి అనగానే చప్పున గుర్తొచ్చే పేరు జార్జిరెడ్డి. నేటి తరానికి అతణ్ని పరిచయం చేస్తూ తీసిన బయోపిక్ ‘జార్జి రెడ్డి’ పేరుతోనే నిర్మించిన చిత్రంపై అటు చిత్రసీమలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. దాదాపు 5 దశాబ్దాల కిందట జార్జిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యార్థుల్లో రగిలించిన చైతన్యాన్ని కళ్లకు కడుతూ నిర్మించిన ఈ చిత్రంలోని ‘సమరం మనది అయితే’ వీడియో సాంగ్‌ను ఈ రోజు విడుదల చేశారు. 

‘సమరం మనది అయితే.. విజయం మనదె కదా

కలలే కడలి ఒడిలో.. అలలై ఎగిసె కదా 

ఈ విడివిడి అడుగులు ఒకటై పరుగులు పడితే 

జగమంతా మనవెంటే జయమంటూ సాగదా..!’ అని సాగుతుందీ పాట. 

ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల సమస్యలపైనే కాకుండా రైతులు, ఇతర బడుగుబలహీన వర్గాలకు న్యాయం కోసం జార్జిరెడ్డి పడిన తపనను పాటలో పరిచయం చేశారు. ఆనాటి రాజకీయాలను, ఆందోళనలను, విద్యార్థుల పోరాటాన్ని అద్భుతంగా చూపారు. ప్రముఖ చైతన్య ప్రసాద్ రాయగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఇప్పటికే విడుదలైన జార్జి రెడ్డి ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మైక్ మూవీస్ బ్యానర్‌పై అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి ‘దళం’ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించగా, ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ టైటిల్ రోల్ పోషించారు. ఈ నెల 22న చిత్రం విడుదల కానుంది.