నమ్మండి బాబూ నమ్మండి.. ఇది మన హైదరాబాదే..! - MicTv.in - Telugu News
mictv telugu

నమ్మండి బాబూ నమ్మండి.. ఇది మన హైదరాబాదే..!

November 29, 2017

గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్(జీఈఎస్) కోసం హైదరాబాద్ రూపు రేఖలను మార్చేశారు. నగరం కొత్త పెళ్లికూతురులా కళకళలాడుతోంది. కొన్ని రోడ్లయితే.. ఎప్పుడు వేశారబ్బా అని ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సదస్సు కోసం వచ్చిన ప్యాట్రిక్ రిచర్డ్‌సన్ అనే విదేశీ పాత్రికేయుడు సోషల్ మీడియాలో పెట్టిన ఒక హైదరాబాద్ వ్యూ ఫోటో వైరల్ అయిపోయింది. దీన్ని చూసిన వాళ్లు ఇది హైదరాబాద్ దృశ్యం అంటే నమ్మలేనంత పోష్‌గా ఉంది వ్యూ.

 

అమెరికాలోని బోస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘స్విర్ లింగ్ మీడియా’ తరఫున హాజరైన  రిచర్డ్‌సన్ ఈ సదస్సుకు హాజరయ్యాడు. అతనికి రహేజీ ఐటీ పార్క్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. అతడు తన హోటల్ గది నుంచి బయట కనిపిస్తున్న దృశ్యాన్ని క్లిక్ చేసి ట్విటర్లో పెట్డు. ‘హైదరాబాద్ కు వచ్చేశాం.. ఇక నిద్రించే సమయమైంది’ అని  క్యాప్షన్ పెట్టాడు.

ఫొటోలో అచ్చం అమెరికా, బ్రిటన్ వంటి విదేశాల్లో బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. చక్కని, శుభ్రమైన విశాలమైన రోడ్లు ముచ్చటగొలుపుతున్నాయి. ఇది తొలుత చూసిన వారు హైదరాబాద్ అంటే నమ్మలేకపోతున్నారు.  కానీ, నమ్మాల్సిందే. కదా.. ఆ ఫొటోనూ మీరూ చూడండి..