get exciting offers of iphones in flipkart
mictv telugu

ఐఫోన్ కోసం చూసేవారికి గుడ్ న్యూస్..భారీ ఆఫర్లు

November 17, 2022

యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఫ్లిప్ట్‌కార్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ 12, 13, 14 ఫోన్లపై భారీ అఫర్లతో ముందుకొచ్చింది. యాపిల్ డేస్ సేల్ పేరుతో డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్‌లో బ్యాంక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI, ఇతర ఇగ్గింపులు అందుబాటు ఉన్నాయి. ఈనెల 20వ తేదీ వరకు ఈ విక్రయాలు కొనసాగనున్నాయి.

ఐఫోన్- 12 128జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.64,990 కాగా, కేవలం రూ.55,999కు సొంతం చేసుకోవచ్చు. ఫెడరల్ బ్యాంకు కార్డులపై రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. ఐఫోన్ -13 256 జీబీ వేరియంట్ సైతం రూ.5వేలు తక్కువగా రూ.74,999కే లభిస్తోంది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కార్డుపై రూ.5,000 తగ్గింపు పొందొచ్చు. ఫెడరల్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుతో చెల్లింపులు చేసే వారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. పాత ఫోన్ ఎక్సేంజ్‌పై మరో రూ.17,500 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఐఫోన్ 14 బేస్ మోడల్ ధర రూ.79,900 కాగా, తగ్గింపై రూ.74,900కే లభిస్తోంది. ఇదే ధరకు యాపిల్ ఈ-స్టోర్ నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఐఫోన్ -13 128జీబీ స్టోరేజీ ధర రూ.69,900 కాగా, రూ.64,999కే లభిస్తోంది.