Get married when you are young: Governor's advice
mictv telugu

వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోండి : గవర్నర్ సలహా

June 29, 2022

Get married when you are young: Governor's advice

నేటి ఆధునిక సమాజంలో యువత చదువులు, కెరీర్ అంటూ పెళ్లిళ్లను వాయిదా వేస్తున్నారు. చాలా వరకు 30 దాటిన తర్వాత పూర్తిగా సెటిల్ అయ్యామన్న భావన వచ్చాక పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఆరోగ్యపరంగా ఈ వైఖరి సరికాదని వైద్య నిపుణులు ఎప్పటినుంచో చెప్తున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, ఆలస్యంగా పిల్లలను కనడం ద్వారా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తాయని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మంగళవారం బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య విద్యార్ధులకు కీలక సూచనలిచ్చారు. ‘వయసులో ఉన్నప్పుడే వివాహం చేసుకోవాలి. నేను మెడిసిన్ ఫస్టియర్‌లో ఉండగానే పెళ్లి చేసుకున్నాను. పెళ్లి తర్వాత చదువు కొనసాగించి అన్ని సబ్జెక్టులలో పాసయ్యాను. మీరు ఎలాంటి అపోహ పెట్టుకోవద్దు. చదువు పూర్తయ్యాకే పెళ్లి వంటి ఆలోచన వద్దు. సాధ్యమైనంత వరకు సరైన వయసులో పెళ్లి చేసుకోండి’ అని సూచించారు.