get ready for ipl-2023 auction
mictv telugu

ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టేదెవరు..? లైవ్‌లో చూడాలంటే…

December 23, 2022

get ready for ipl-2023 auction

ఐపీఎల్-2023 వేలం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. కొచ్చిలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో వేలం నిర్వహించనున్నారు. ఐపీఎల్ వేలం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆటగాళ్ళు ,
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది గంటత్లో ఏయే ఆటగాళ్లు కోటీశ్వరులు కానున్నారో తేలిపోనుంది. కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు సైతం తమ ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాయి. మొత్తం 405 మంది ఆటగాళ్లు వేలానికి అందుబాటులో ఉన్నారు. వారిలో 273 మంది భారతీయులు కాగా, 132 మంది విదేశీయులు ఉన్నారు.మొత్తం 10 ఫ్రాంచైజీలు కలిపి 87 మంది ప్లేయర్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. వారిలో 30 విదేశీ ఆటగాళ్లు ఉండనున్నారు.వారెవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వీరి కోసం పోటీ పడొచ్చు..

వరల్డ్ బెస్ట్ ఆల్ రౌండర్స్, హిట్టర్లతో పాటు యంగ్ ప్లేయర్స్ ఈసారి వేలంలో ఉండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. బెన్‌స్టోక్స్, కామెరూన్ గ్రీన్, సామ్ కర్రన్, కేన్ విలియమ్సన్, జో రూట్, షకీబ్ అల్ హసన్, మయాంక్ అగర్వాల్,హ్యారీ బ్రూక్, నికోలస్ పూరన్,జేసన్ హోల్డర్ వంటి స్టార్స్ ఆటగాళ్లకు తోడు హెన్రిచ్ క్లాసెన్, జయదేవ్ ఉనద్కత్, జగదీషన్,లిటన్ దాస్, ఓడియన్ స్మిత్ వంటి మ్యాచ్ ను మలుపుతిప్పే బ్యాటర్లు, బౌలర్స్, ఆల్ రౌండర్లు ఉండడంతో వేలం రసవతర్తంగా సాగనుంది.

ఎవరి పర్సులో ఎంత డబ్బులు..

సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.42.25 కోట్లు
పంజాబ్ కింగ్స్ రూ.32.2 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్ రూ.23.35 కోట్లు
ముంబై ఇండియన్స్ రూ.20.55 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్ రూ.20.45 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర రూ.19.45 కోట్లు
గుజరాత్ టైటాన్స్ రూ.19.25 కోట్లు
రాజస్తాన్ రాయల్స్ రూ.13.2 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరురూ.8.75 కోట్లు
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ పర్సులో రూ. 7.05 కోట్లు

ఐపీఎల్ వేలం లైవ్ వీటిలో చూడొచ్చు..

ఐపీఎల్ – 2023 మినీ వేలం ప్రత్యక్ష ప్రసారం మధ్యాహ్నం 2:30 గంటలకు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడొచ్చు. దీంతో పాటు జియో సిమ్ వాడుతున్నవాళ్లు, జియో సినిమా యాప్‌లో ఐపీఎల్ 2023 మినీ వేలాన్ని ఉచితంగా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించే అవకాశం ఉంది.