పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ‘భీమ్లానాయక్’ రానా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సినిమాలోని టైటిల్ సాంగ్ తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ర్యాప్ సాంగ్ ఒకటి రిలీజ్ చేస్తానంటూ సంగీత దర్శకుడు ఎస్. ఎస్. థమన్ ప్రకటించారు. ‘ర్యాప్ సాంగ్‌తో మంట పెట్టబోతున్నాం. పవన్ అభిమానులు సిద్ధంగా ఉండాలం’టూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పటికే ర్యాప్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేయగా.. ఇప్పుడు పాట వీడియోను రిలీజ్ చేస్తారేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా, చిత్రం విడుదల తర్వాత కూడా ర్యాప్ సాంగ్ రావడం అనేది ఓ రికార్డుగా టాలీవుడ్‌లొ చర్చించుకుంటున్నారు. మరోవైపు మార్చి 25న భీమ్లానాయక్ సినిమా ప్రముఖ ఓటీటీలైన డిస్నీ హాట్‌స్టార్, ఆహాలలో ప్రసారం కానుంది. మలయాళ సినిమాకు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం మూడు రోజుల్లోనే వంద కోట్లను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. త్రివిక్రమ్ మాటలు అందించిన ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించారు.
#BheemlaBackOnDuty !! 🍭🧿 #TheRapSong 💥💥💥💥💥💥💥 Get ready for Fireworks guys #BlockBusterBheemlaNayak 💥💥💥💥 pic.twitter.com/6i7UzlcFLf
— thaman S (@MusicThaman) March 4, 2022