Home > Featured > 45 నిమిషాల్లో 2 లక్ష లోన్..6 నెలలు నో ఈఎంఐ

45 నిమిషాల్లో 2 లక్ష లోన్..6 నెలలు నో ఈఎంఐ

లాక్ డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎందరో ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ ముఖ్యంగా మధ్యతరగతి, పేద కుటుంబాలపై పడింది. దీంతో వీళ్ళను ఆదుకోవడానికి ఎస్బిఐ బ్యాంకు ముందుకు వచ్చింది. వీరి కోసం ప్రీ అప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్‌ లేదా ఎమర్జెన్సీ లోన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఎమర్జెన్సీ లోన్‌ను ప్రజలు 45 నిమిషాల్లోనే ఇంట్లో ఉండే పొందవచ్చు. ఈ లోన్ కు ఆరు నెలల తర్వాత ఈ ఈఎంఐ పేమెంట్ మొదలవుతుంది.

ఈ ఎమర్జెన్సీ లోన్‌కు ఏడాదికి 7.25 శాతం వడ్డీ వేయనుంది. ఇది సాధారణంగా పర్సనల్‌ లోన్స్‌పై విధించే వడ్డీ కంటే చాలా తక్కువ కావడం గమనార్హం. ఈ లోన్ పొందడానికి మీరు అర్హత ఉందా లేదా తెలుసుకోవడం కోసం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి పీఏపీఎల్ అని రాసి స్పేస్ ఇచ్చి, మీ అకౌంట్ నెంబర్ చివరి నాలుగు నెంబర్లు రాసి, 567676కి ఎస్‌ఎంఎస్ చేయాలి. ఇలా పంపాక మీరు పర్సనల్ ఎమర్జెన్సీ లోన్‌కు అర్హులో కాదో ఎస్సెమ్మెస్ వస్తుంది. మీరు ఈ లోన్ పొందడానికి అరుహులైతే ఈ లోన్ తీసుకోవడానికి యోనో ఎస్‌బీఐ యాప్‌లో అవైల్ నౌ అప్షన్లను క్లిక్ చేసి ఆ తర్వాత లోన్ టెన్యూర్‌ను, అమౌంట్ సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్‌ చేస్తే.. మీ అకౌంట్‌లోకి ఆటోమేటిక్‌గా మనీ క్రెడిట్ అవుతుంది.

Updated : 4 May 2020 3:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top