Ghanim al muftah Qatar world cup ambassador opening sparks interaction
mictv telugu

ఫిఫాలో.. అన్ని కండ్లు అతడి పైనే!

November 22, 2022

The woman who slapped French President Macron on the cheek

ఎంతో ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ మొదలైంది. అది కూడా ఖురాన్లోని సునత్ అల్ హుజూరత్ పఠించిన అబ్బాయి పైనే అందరి చూపు నిలిచిపోయింది. ఈ ఆటలకు అంబాసిడర్గా వ్యవహరిస్తున్న అతడి గురించి ఈ కథనం..

ఆత్మవిశ్వాసానికి మారు పేరుగా నిలుస్తాడు ఘనిమ్ అల్ ముఫ్తా. నిన్న జరిగిన ఫిఫా పుట్బాల్ ఛాంపియన్ షిప్ని అమెరికన్ నటుడు మోర్గాన్ ఫ్రీమాన్తో కలిపి ఈ 20యేండ్ల కుర్రాడు ప్రారంభించాడు. ఖతార్లోన అల్‌‌ బైత్ స్టేడియంలో వీరి మాటలకు వేదికగా నిలిచింది. మోర్గాన్తో పాటు ఉన్న ఘనిమ్ గురించి అందరూ ఆరాలు తీస్తున్నారు. ఎందుకంటే.. శరీర కింద భాగం లేని యువకుడు ప్రపంచ వేదిక మీద ప్రసంగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్ఫూర్తిదాయకమైన అతని జీవన ప్రయాణం తెలుసుకోవాల్సిందే!

ఘనిమ్ అల్ ముఫ్తా. 5 మే 2002లో ఖతార్ లో ఇమాన్ అహ్మద్ , మొహమ్మద్ అల్ ముఫ్తా దంపతులకు జన్మించిన కవల పిల్లల్లో ఒకడు. అతని ట్విన్ పేరు అహ్మద్ ముఫ్తా. ఘనిమ్ తల్లి గర్భవతిగా ఉన్నప్పుడే ఆమెను డాక్టర్లు హెచ్చరించారు. కవలల్లో ఒకరు తీవ్రమైన జబ్బు బారిన పడతరాని, వెంటనే అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చారు. కానీ వాళ్ల మాటలను ఆ తల్లి పట్టించుకోలేదు. దీంతో ఘనిమ్ పుట్టుకతోనే అరుదైన ‘Caudal Regression Syndrome’కి గురయ్యాడు. 25వేల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని డాక్టర్లు అంటున్నారు. ఘనిమ్ అంటే యుద్ధరంగ విజేత. తమ కొడుకు కూడా ఎన్ని కష్టాలు ఎదురైన ఎదురించి పోరాడాలని అతడికి ఆ పేరు పెట్టుకున్నారట. పదిహేనేళ్లే బతుకుతాడన్న వ్యక్తి మరణ భయం లేకుండా సాధారణ పిల్లలు చెయ్యలేని అనేక పనులు చేసి అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు.

అంబాసిడర్గా..

చిన్నప్పటి నుంచి ఘనిమ్కు ఆటలంటే మక్కువ. చేతులకు గ్లప్స్ వేసుకొని ఫుట్ బాల్ ఆడేవాడు. ఖతార్ లోని అతిపెద్ద పర్వత శిఖరాన్ని అధిరోహించి తాను నిజమైన విజేతనని నిరూపించుకున్నాడు. స్విమ్మర్ గా, స్కూబా డైవర్ గా పేరుపొందాడు. అంతేకాదు.. ఘనిమ్ ఖతార్ లోనే అత్యంత పిన్నవయస్కుడైన పారిశ్రామికవేత్తగా పేరు సంపాదించాడు. ఇతడు గారిస్సా బ్రాండ్ ఐస్ క్రీమ్ కంపెనీ అధినేత. తన ఐస్ క్రీమ్ కంపెనీలో 60 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

మోటివేషనల్ స్పీకర్, యూట్యూబర్, వ్లాగర్ గా వేలమంది ఫాలోవర్స్ కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఖతార్ ఫిఫా వరల్డ్ కప్ గుడ్ విల్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఘనిమ్… ఖతార్ దేశ డిప్లొమాట్ గా పనిచేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం పొలిటికల్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. తన జీవితం తనకు ఎన్నో పాఠాలను నేర్పిందని, తన కలలు సాకారం చేసుకోవడానికి ఎంత కష్టాన్ని అయినా ఎదుర్కుంటానంటున్నాడు ఘనిమ్. అతని కల సాకారం కావాలని మనమూ కోరుకుందాం.