ఘంటసాల బయోపిక్.. ఆస్తులు తాకట్టు పెట్టి తీశాం..   - MicTv.in - Telugu News
mictv telugu

ఘంటసాల బయోపిక్.. ఆస్తులు తాకట్టు పెట్టి తీశాం..  

October 6, 2018

టాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘మహానటి’ సినిమా విడుదలై భారీ విజయం సాధించింది. అంతేకాదు సినీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ కూడా రూపొందుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ స్వయంగా నటిస్తున్న విషయం తెలసిందే.. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ కూడా విడుదలకు సిద్ధమైంది.

ttt

అమరగాయకుడు ఘంటసాల జీవిత కథ ఆధారంగానూ బయోపిక్ రూపొందుతోంది. ఘంటసాల ద గ్రేట్ అనే ఈ చిత్రంలో ఘంటసాల దంపతులుగా గాయకుడు కృష్ణచైతన్య, ఆయన భార్య మృదుల నటిస్తుండగా.. సీహెచ్.రామారావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది.  

ఈ చిత్ర దర్శకుడిపై ఘంటసాల కుమారుడు రత్నకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబసభ్యుల అనుమతి లేకుండా బయోపిక్ ఎలా తీస్తారని మండిపడ్డారు. చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో చిత్ర బృందం తెలుగు ఫిల్మ్ చాంబర్‌లో మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. తాము ఘంటసాల పై అభిమానంతోనే సినిమా తీశామని, సినిమా నిర్మాణానికి ఆస్తులు తాకట్టు పెట్టి, అప్పులు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఘంటసాల కుటుంబీకులు తమకు మద్దతివ్వాలని కోరారు.