Ghatkesar Sub-Registrar Sitaram was arrested by ACB officials.
mictv telugu

ఏసీబీకి చిక్కిన ఘట్‌కేసర్ సబ్ రిజిస్ట్రార్

June 7, 2022

Ghatkesar Sub-Registrar Sitaram was arrested by ACB officials.

హైదరాబాద్ నగర శివార్లలోని ఘట్‌కేసర్ సబ్ రిజిస్ట్రార్ సీతారాంను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం నాడు ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహారంలో లంచం తీసుకుంటున్నారనే ఫిర్యాదు మేరకు.. అధికారులు సబ్‌ రిజిస్ట్రార్‌ సీతారాం, అసిస్టెంట్ కిశోర్‌ను అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ. 70 వేలు అంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

ఘట్ కేసర్ మండలంలోని అవుషాపూర్ గ్రామంలో గ్రామ కంఠానికి చెందిన రెండు ఫ్లాట్స్ ను రిజిస్ట్రేషన్ చేసేందుకు రిజిస్ట్రార్ సీతారాం లంచం డిమాండ్ చేశాడు. సుదర్శన్ అనే వ్యక్తి నుండి సీతారాం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సీతారాంతో పాటు కిషోర్ అనే మరో ప్రైవేట్ వ్యక్తిని అరెస్ట్ చేశారు. సీతారాం నివాసం, కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.