Ghaziabad court gives death sentence to 2006 Varanasi blasts convict Waliullah
mictv telugu

కాశీ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారికి ఉరిశిక్ష

June 6, 2022

Ghaziabad court gives death sentence to 2006 Varanasi blasts convict Waliullah
వారణాసిలో పదహారేళ్ళ క్రితం జరిగిన వరుస బాంబు పేలుళ్ళ కేసులో ఉగ్రవాది వలియుల్లా ఖాన్‌కు యూపీ గాజియాబాద్ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. శనివారం జరిగిన విచారణలో వలియల్లా ఖాన్ దోషి అని నిర్ధారించింది కోర్టు. 2006 లో వారణాసిలో జరిగిన బాంబు పేలుళ్ల సూత్రధారిగా తేల్చి ఈ మేరకు శిక్ష ఖరారు చేసింది.

2006 మార్చి 7న సంకట్ మోచన్ ఆలయం, కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ మారణ హోమంలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 100 మందికి పైగా గాయపడ్డారు.ఈ ఘటనకు సంబంధించి.. హత్య, హత్యాయత్నం, తీవ్రంగా గాయపరచడం, ఆయుధాలను అక్రమంగా వినియోగించడం తదితర నేరారోపణలతో వలీఉల్లా ఖాన్పై అభియోగాలను మోపారు పోలీసులు. ఈ మేరకు రెండు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో పోలీసులు సరైన సాక్ష్యాధారాలు చూపడం వల్ల.. కోర్టు మరణశిక్షను విధించింది.