కుక్కను చంపిన  డాక్టర్‌కు జైలు శిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

కుక్కను చంపిన  డాక్టర్‌కు జైలు శిక్ష

December 2, 2019

Doctor ..

కుక్కను చంపిన కేసులో ఓ డాక్టర్‌కు కోర్టు 14 రోజుల జైలు శిక్ష విధించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ ఫిర్యాదుతో అతడి ఈ శిక్షపడింది. ఫిర్యాదు చేసిన మహిళకు డాక్టర్‌కు మధ్య జరిగిన గొడవలో కుక్క మరణించింది. దీంతో అతడికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. 

 విజయ్ నగర్‌లో డెంటిస్ట్ యామిన్ సిద్ధిఖీ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఓ రోజు అతడి ఎదురింట్లో ఉండే మహిళ తన కూతురుకు పంటి నొప్పి రావడంతో చికిత్స కోసం తీసుకువచ్చింది.  ఆరు నెలలపాటు వైద్యం చేసి గట్టిగానే డబ్బులు గుంజాడు. అయినా నొప్పి ఏ మాత్రం తగ్గలేదు. డబ్బులు తీసుకొని సరిగా వైద్యం చేయలేదని ఆ మహిళ వాగ్వాదానికి దిగింది. దీంతో తరుచూ గొడవ జరుగుతుండటంతో అతడు ఆ మహిళను బెదిరించే వాడు. 

ఈ వివాదం ఇలాగే కొనసాగుతుండగా ఇటీవల ఓ రోజు అతడు కత్తి తీసుకొని ఆమెపైకి వెళ్లాడు. దుర్భాషలాడుతూ దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న పెంపుడు కుక్క ‘లడ్డూ’ అరుస్తూ డాక్టర్ మీదకు వచ్చింది. అతడు దాని  గొంతుపై కాలు పెట్టి తొక్కాడు. ఊపిరి ఆడక ఆ మూగజీవి అక్కడికక్కడే మరణించింది. తర్వాత సిద్దిఖీ చాకుతో ఆమెపైకి మళ్లీ వచ్చాడు. హెల్ప్ హెల్ప్ అని తల్లీ కూతుళ్లు అరవడంతో పారిపోయాడు.అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కుక్కను చంపడంతో పాటు మహిళలపై దాడికి దిగడంతో 14 రోజులు జైలు శిక్ష విధించింది కోర్టు.