షాక్.. చనిపోయిన యువతి ప్రాణాలతో వచ్చింది - MicTv.in - Telugu News
mictv telugu

షాక్.. చనిపోయిన యువతి ప్రాణాలతో వచ్చింది

August 4, 2020

Ghaziabad suitcase case.

తప్పిపోయిన యువతి సూట్‌కేసులో శవమై తేలింది. దీంతో ముక్కులుగా ఉన్న కుమార్తె మృతదేహాన్ని చూసి ఆ కన్నవారు కన్నీరు మున్నీరు అయ్యారు. అయితే చనిపోయింది అనుకున్న సదరు యువతి బతికి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిందని పోలీసులు ప్రకటించిన సదరు యువతి.. పోలీస్ స్టేషన్‌కు రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఆమెను చూసిన కుటుంబ సభ్యులు, పోలీసులు కూడా షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. 

ఓ యువతిని కొందరు హత్యచేసి శవాన్ని సూట్‌కేసులో పెట్టి పారేశారు. అయితే ఆ మృతదేహాన్ని ఘజియాబాద్‌కు చెందిన ఓ కుటుంబం గుర్తుపట్టింది. దీంతో ఆమె మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకే చనిపోయిందని పోలీసులు ప్రకటించిన యువతి స్టేషన్‌కు వచ్చింది. తాను చనిపోలేదని బతికే ఉన్నానని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కట్నం కోసం భర్త వేధిస్తుండటంతో ఇంటి నుంచి తాను పారిపోయానని తెలిపింది. దీంతో జూలై 23న ఆమె భర్త మిస్సింగ్ కేసు పెట్టాడు. ఆ సమయంలో సూట్‌కేసులో దొరికిన శవం ఆమెదే అని ఆ కుటుంబం సహా పోలీసులు కూడా పొరబడ్డారు. కాగా, ఎట్టకేలకు చనిపోయిందనుకున్న తమ కుమార్తె తిరిగి రావడంతో వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.