GHEE HELPS TO REDUCE BODY WEIGHT
mictv telugu

నెయ్యి తింటే లావవుతారా?

November 25, 2022

 GHEE HELPS TO REDUCE BODY WEIGHT

నెయ్యి…. మనం తినే ఏదైనా అతి రుచిగా మారాలంటే కాస్తంత నెయ్యి తగలాల్సిందే. పప్పు నుంచి చపాతీ వరకూ నెయ్యి పడితే చాలు ఆ వంట నెక్ట్స్ లెవల్. ఆ వాసనకే కడుపు నిండిపోయిందా అన్నట్లుగా ఉంటుంది. కానీ నెయ్యిని చాలా మంది అవాయిడ్ చేస్తారు. నెయ్యిలో ఫ్యాటీ గుణాలు ఉండడమే దీనికి కారణం. ప్రస్తుతం అందరూ హెల్త్, డైటింగ్ అంటూ నెయ్యి, నూనెలను దూరంగా పెడుతున్నారు. నూనె లేకుండా వంట లేదు కాబట్టి దాన్ని వాడటం మానడం లేదు కానీ నెయ్యిని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అన్నింటి కంటే నెయ్యే శ్రేష్టమైనది అని.

అన్నీ సక్రమంగా అందితేనే మన శరీరం బాగా పని చేస్తుంది. ఏ ఒక్కటి తక్కువ అయినా వెంటనే ప్రభావం కనిపిస్తుంటుంది కూడా. అలాగే మన బాడీకి ఫ్యాట్ కూడా చాలా అవసరం. అతిగా ఉండకూడదు కానీ ఉండాల్సినంత మాత్రం కచ్చితంగా తినాలి. మన బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్ ను చాలా రకాలుగా మనం సంపాదించుకోవచ్చును. అందులో అన్నింటికన్నా ఉత్తమ మార్గం నెయ్యి తినడం. నెయ్యి మన శరీరానికి మంచి కొలెస్ట్రాల్ ను అందిస్తుంది. అది మనలోని జీవక్రియలు సక్రమంగా పనిచేసేటట్టు చూడడమే కాకుండా బాడీ పనితీరును కూడా క్రమబద్ధీకరణ కూడా చేస్తుంది. చాలా మందికి నెయ్యి తింటే బరువు పెరుగుతారు అనే అపోహ ఉంటుంది. కానీ డాక్టర్ల నుంచి పడైటీషియన్ల వరకూ అందరూ చెప్పే మాట నెయ్యి కచ్చితంగా మన భోజనంలో ఒక పార్ట్ చేసుకోవాలని. అంతేకాదు బరువు తగ్గడంలో నెయ్యి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందిట కూడా. చపాతీలోని గ్లైసెమిక్ ఇండెక్స్‌ని తగ్గించడంలో నెయ్యి సాయపడతుందట. అందువల్ల అస్సలు ఏమీ లేకుండా పుల్కాలు తినడం కంటే నెయ్యి వేసుకుని తింటేనే చాలా మంచిదని అంటున్నారు డైటీషియన్లు. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది కార్బోహైడ్రేట్స్ కలిగి ఉన్న ఫుడ్‌కి రేటింగ్ సిస్టమ్. ప్రతి ఫుడ్ మీ రక్తంలో చక్కెర స్థాయిని ఎంత త్వరగా ప్రభావితం చేస్తుందో చూపిస్తుంది. దీనిని కంట్రోల్ చేయడంలో నెయ్యి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు నెయ్యి వల్ల కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇందులో కొవ్వులో కరిగే విటమిన్స్ ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు సహాయపడతాయి.

అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన అంశం ఏంటంటే….అతి సర్వత్ర వర్జయేత్. దేనిని అతిగా తీసుకోకూడదు. అలాగే నెయ్యిని కూడా. తినమన్నారు కదా అని అదే పనిగా తింటే మన అపోహలన్నీ నిజమే అవుతాయి. నెయ్యి హార్మోన్లను సమతుల్యం చేయడంలో, ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ని నిర్వహించడంలో కీ రోల్ పోషిస్తుంది.అధిక హీట్ పాయింట్‌తో సెల్ పనితీరును దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ని ఉత్పత్తి చేయడాన్ని నిరోధిస్తుంది. కానీ ఇదంతా మితంగా తింటేనే….

చాలామంది సెలబ్రీటీలు కూడా నెయ్యి తినమని చెబుతున్నారు. అసలు మలైకా అరోరా, కత్రినా కైఫ్ లాంటి వాళ్ళు అయితే తమ రోజును నెయ్యితోనే ప్రారంభిస్తారుట కూడా.చాలా మంది బీటౌన్ సెలబ్రిటీస్ ఖాళీ కడుపుతో ఓ టేబుల్ స్పూన్ నెయ్యితో తమ రోజుని మొదలెడతారుట. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కణాల పునరుత్పత్తి ప్రక్రియను మెరుగుపరచడం ద్వారా శరీర వైద్య ప్రక్రియలో సాయపడుతుంది. ఎంతగా అంటే బరువు తగ్గడానికి కూడా సాయపడుతుంది అని చెబుతున్నారు. చూశారుగా నెయ్యి తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో. కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు స్పూన్ ల నెయ్యి తినండి. ఆరోగ్యంగా ఉండండి.