టీమిండియా క్రికెటర్ ఇంటిని కూల్చివేసిన జీహెచ్ఎంసీ - MicTv.in - Telugu News
mictv telugu

టీమిండియా క్రికెటర్ ఇంటిని కూల్చివేసిన జీహెచ్ఎంసీ

April 8, 2022

 

హైదరాబాదులో శ్రావణి అనే మహిళా క్రికెటర్ ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. సికింద్రాబాద్ పరిధిలోని తూకారాం గేట్ ప్రాంతంలో నివసిస్తున్న రంజీ క్రికెటర్ ఇంటి విషయంలో గతంలో నోటీసులు ఇచ్చామని అధికారులు చెప్తున్నారు. ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉండడంతో నోటీసు ఇచ్చి కూల్చివేశామన్నారు. ఈ విషయంపై శ్రావణి మాట్లాడుతూ.. ‘నోటీసు వచ్చిన వెంటనే ఇంటికి తగిన మరమ్మత్తులు చేశాం. అది పట్టించుకోకుండా అధికారులు సామానంతా బయట పడేసి కూల్చేశారు. ఈ ఘటన వెనుక డిప్యూటీ స్పీకర్ పద్మారావు కొడుకు రామేశ్వర్ గౌడ్ హస్తం ఉంది. గతంలో నన్ను బెదిరించి, డబ్బులిచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకోమన్నాడు. ఈ నెల 15వ తేదీ నుంచి జరిగే మహిళల టీ20 సిరీస్‌లో నేను క్రికెట్ ఆడాల్సి వుంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్ధం కావటం లేద’ని ఆవేదన వ్యక్తం చేశారు.