ఈగల బిర్యానీ కావాలా.. అయితే కృతుంగాకు వెళ్లండి - MicTv.in - Telugu News
mictv telugu

ఈగల బిర్యానీ కావాలా.. అయితే కృతుంగాకు వెళ్లండి

October 24, 2018

హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లలో జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రతను పాటించలేదనే సమాచారంతో తనిఖీలు నిర్వహించిన జీహెచ్‌ఎంసీ అధికారులకు కీలక విషయాలు తెలిశాయి.GHMC checks in kritunga restaurant .. penalityగచ్చిబౌలిలోని కృతుంగ రెస్టారెంట్‌లో అధికారులు నిన్న రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో రెస్టారెంట్‌లో అపరిశుభ్రతో పాటు నాణ్యత లేని ఆహారా పదార్థాలను వినియోగదారులకు వడ్డిస్తున్నారని తెలిసింది. ఆహారపదార్థాలపై మూతలు పెట్టకుండా.. ఈగలు వాలుతున్న బిర్యానీ‌ని వినియోగాదారులకు వడ్డిస్తున్నారు. గుర్తింపు లేని మాంసాన్ని వంటల తయారీకి ఉపయోగిస్తున్నారని గుర్తించారు. రెస్టారెంట్ పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తుండటంతో నిర్వహకులకు ఏఎంవో‌హెచ్ బిందుభార్గవి రూ. 6వేల జరిమానా విధించారు.