రూ.1,000 కోట్లతో సరికొత్త రికార్డ్ సృష్టించనున్న జీహెచ్ఎంసీ - MicTv.in - Telugu News
mictv telugu

రూ.1,000 కోట్లతో సరికొత్త రికార్డ్ సృష్టించనున్న జీహెచ్ఎంసీ

August 2, 2022

జీహెచ్‌ఎంసీ అతి త్వరలో ఓ సరికొత్త రికార్డు సృష్టించనుంది. వెయ్యి కోట్ల రూపాయల మేర ఆస్తిపన్ను(ప్రోపర్టీ ట్యాక్స్) వసూళ్లను రాబట్టనుంది. తొలి 4 నెలల్లోనే రూ.999.05 కోట్ల ఆస్తి పన్ను వసూల్ చేసి జీహెచ్‌ఎంసీ చరిత్ర సృష్టించింది. ఎర్లీ బర్డ్ పథకంలో 5 శాతం రిబేట్‌తో రూ.741.35 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను లక్ష్యం రూ.2 వేల కోట్లు పెట్టుకుంది. ఏప్రిల్, మే, జూన్‌లలో రూ.929.65 కోట్లు వసూలు చేయడంతో తన టార్గెట్‌ను పూర్తి చేయడం సులువుగా మారింది. జులైలో జీహెచ్‌ఎంసీ రూ.68.1 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేసింది.