తొలి మెట్రో రైల్లో కమిషనర్‌కే చోటు లేదు! - MicTv.in - Telugu News
mictv telugu

తొలి మెట్రో రైల్లో కమిషనర్‌కే చోటు లేదు!

November 28, 2017

హైదరాబాద్ మెట్రో రైలు కాసేపట్లో పట్టాలెక్కనుంది. అయితే మెట్రో పనుల్లో ఎంతగానో సహకరించిన జీహెచ్ఎంసీ ఈ చారిత్రక ఘట్టంలో ప్రాధాన్యం లేకుండా పోయింది. మెట్రో రైలును ప్రారంభించాక, అందులో ప్రధాని నరేంద్రమోదీతో కలిసి ప్రయాణించే పలువురు ప్రముఖుల జాబితాలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి పేరు గల్లంతైంది.

ఇప్పటికే మెట్రో రైలు శిలాఫలకంపై నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేరుకు చోటు లేకుండా పోయింది. తొలి రైలు ప్రయాణికులల్లో కమిషనర్ పేరు లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. కార్పొరేట్లరు, బల్దియా అధికారులు ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.