నిరుద్యోగం బల్దియా అదికారులకు కాసుల పంట పండిస్తుంది. నిరుద్యోగ యువకుల అవసరాన్ని అసరా చేసుకున్న కోంత మంది అధికారులు భరితెగిస్తున్నారు. వేలం పెట్టి మరి ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు. లక్షల్లో దండుకుంటూన్నారు. బల్దియాలోని అన్ని విభాగాల్లో ఇదే తంతు. తాజాగా కమీషనర్ ఆదేశాలను కూడా బుట్టదాఖలు చేస్తు ఎంటమాలజీ…. శానీటేషన్ విభాగాల్లో ఉద్యోగాలను అమ్మెయ్యడం …. కార్మికుల జీతాలను కోట్టేయ్యడం చేస్తున్నారు.
ఎళ్ల తరబడి బల్దియా లో తిష్ట వేసిన అధికారుల లీలలు రోజుకోరూపంలో బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు బల్దియాను లంచాలకు కేరాఫ్ ఆడ్రస్ గా మార్చిన అవినీతి గణం ఇప్పుడు రూట్ మార్చింది. అక్రమాలకు పాల్పడుతుంది చాలదన్నట్లుగా……, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం అడుతున్నారు. మంచి ఉద్యోగాలున్నాయంటూ అమయాకులకు గాలం వేస్తారు. లక్షలు ముట్టజెప్పితేనే ఉద్యోగానికి సైయ్యంటురు లేదంటే నై అంటారు.
జిహెచ్ఎంసిలో 2016 అక్టోబర్ నుండి బయోమెట్రిక్ పద్దతికి శ్రీకారం చుట్టారు అధికారులు. డిసెంబర్ తరువాత కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఎవ్వరీని నియమించ కమీషనర్ ఆర్డర్ వేశారు. కాని బల్దియా మలేరియా విభాగంలో అధికారులు తమకా నిభందనలు వర్తించవన్నట్లుగా ప్రవర్థిస్తున్నారు. నార్త్ జోన్ ఈస్ట్ జోన్ లలో ఈ విభాగంలో సీనియర్ ఎంటమాలజీస్ట్ గా ఉన్న విజయ్ కుమార్ నూతన కార్మికులను రిక్రూట్ చేశారు. ఈ నియామకాల్లో ఒక్కోక్కరిదగ్గ లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపనలున్నాయి. కుత్బుల్లా పూర్ సర్కిల్ పరిదిలో రాజును.., కాప్రాసర్కిళ్లో డి శ్రీనివాస్ ను నియమించారు. అయితే వారికి ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించ లేదు. ఈ ఎస్ఐ పిఎఫ్ కావాలంటే మరిన్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఇక ఇంత కాలం బయోమెట్రిక్ లేఖపోవడంతో అడిందే ఆటగా పాడిండే పాటగా సాగించుకున్న సూపర్ వైజర్లు…. మెడికల్ అధికారులు ఇప్పుడు కూడా దానిని అలానే కోనసాగిస్తున్నారు. శానీటేషన్ కార్మికుల ఎటిఎం కార్డు….., బ్యాంకు పాస్ బుక్ తమ వద్దే పెట్టుకుని కార్మికులకు ఇష్టం వచ్చినంత చెల్లిస్తు చెతులు దులుపుకుంటున్నారు. ఎళ్ల తరబడి పనిచేస్తున్న తమకు వేతనం ఇవ్వకుండా వేదిస్తున్నారంటున్నారు కార్మికులు. ఇక ఒల్డ్ సిటిలో పనిచేసిన వెంకటమ్మ తనను గడిచిన ముడునెలలుగా పనులు చేయ్యకుండా సూపర్ వైజర్ అడ్డుకుంటున్నారని వాపోతుంది. ఎల్లతరబడి జిహెచ్ఎంసి చెల్లిస్తున్న వేతనం తనకు అందడం లేదని….., సూపర్ వైజర్ ఇచ్చినంతే తీసుకోవాలని అంటుంది. తన జీతం పూర్తిగా తనకు ఇవ్వాలని కోరడం తో అసలు పనికే వద్దు ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకోమ్మని అంటున్నారంటున్నారు వెంకటమ్మ.
అయితే బల్దియా అధికారుల తీరుపై ఎన్నిసార్లు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కార్మిక నేతలు.