వాన నీటిని రోడ్డుపైకి వదిలారని రూ. లక్ష జరిమానా.. GHMCలోనే.. - MicTv.in - Telugu News
mictv telugu

వాన నీటిని రోడ్డుపైకి వదిలారని రూ. లక్ష జరిమానా.. GHMCలోనే..

September 30, 2020

mhjm

వాన కారణంగా వరద రావడం, ఆ వరదతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడటం ఎప్పుడూ జరిగే పనే. కానీ కొన్నిసార్లు వర్షం తగ్గిన తర్వాత కూడా రోడ్డుపైకి వరద వస్తూనే ఉంటుంది. చాలా మంది నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లోకి వచ్చిన నీటిని పంపులతో ఎత్తిపోస్తూ ఉంటారు. దీని వల్ల వాహనదారులు వర్షం తగ్గినా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాగే చేస్తున్నవారిపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వర్షపు నీటిని రోడ్డుపైకి వదిలినందుకు ఏకంగా రూ. లక్ష జరిమానా విధించారు. 

నానక్‌రామ్ గూడలోని వాసవీ జీపీ ట్రెండ్స్‌ బిల్డింగ్‌ మేనేజ్‌మెంట్‌కు ఈ ఊహించని పరిణామం ఏర్పడింది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్‌లో ఉన్న హనుమాన్‌ టెంపుల్‌ సమీపంలోని వాసవీ జీపీ ట్రెండ్స్‌ బిల్డింగ్‌ మేనేజ్‌మెంట్‌ అపార్ట్ మెంట్ ఉంది. ఇక్కడ ప్రతిసారి వర్షం పడినప్పుడు సెల్లార్ నిండిపోతోంది. దాన్ని మోటార్ ద్వారా రోడ్డు మీదకు నిర్లక్ష్యంగా వదులుతున్నారు. దీని ద్వారా ట్రాఫిక్ జామ్, వాహనాలు జారిపడటం జరుగుతున్నాయి.  స్థానికుల ఫిర్యాదుతో చాలా సార్లు అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా లెక్కచేయకుండా నీటిని వదలడంతో మంగళవారం జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌ ఫైన్ విధించారు.