GHMC mayor announced the emergency number due to heavy rains
mictv telugu

హైద్రాబాదులో భారీ వర్షం.. ఎమర్జెన్సీ నంబర్ ప్రకటించిన మేయర్

July 28, 2022

తెలంగాణ రాజధాని నగరం హైదరాబాదులో గురువారం భారీ వర్షం కురిసింది. అన్ని ప్రాంతాల్లో వాన కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరే సమయం కావడంతో వరదనీటిలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. మరో మూడ్రోజులు వర్షాలు కురుస్తాయన్న అంచనాలతో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతో మేయర్ విజయ లక్ష్మి సమీక్ష సమావేశం నిర్వహించారు. యంత్రాంగమంతా అందుబాటులో ఉండాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే తక్షణం స్పందించాలని ఆదేశించారు. అత్యవసర సమస్యలుంటే జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నెంబర్లకు (040-21111111, 040- 29555500) ఫోన్ చేయాలని సూచించారు. కాలనీల్లో వర్షపు నీరు నిలువకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, రుతుపవనాల ప్రభావం, షియర్ జోన్‌ వల్ల అప్పటికప్పుడు మబ్బులు ఏర్పడి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ ప్రజలను మనవి చేశారు.