మెహదీపట్నం షాపులపై జీహెచ్ఎంసీ కొరడా.. సీజ్, జరిమానాలు - MicTv.in - Telugu News
mictv telugu

మెహదీపట్నం షాపులపై జీహెచ్ఎంసీ కొరడా.. సీజ్, జరిమానాలు

October 29, 2019

మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లోని షాపులపై జీహెచ్ఎంసీ అధికారులు ఎట్టకేలకు చర్యలు చేపట్టారు. ఇన్నాళ్లుగా అక్రమాలకు పాల్పడుతున్నా ‘ఏవేవో కారణాల’తో ఉపేక్షిస్తూ వచ్చిన అధికారులు ఈ రోజు పలు దుకాణాల్లో తనిఖీలు చేశారు. ట్రేడ్ లైసెన్సులు లేని, ప్లాస్టిక్ నిబంధనలు పాటించని, పార్కింగ్ ప్లేసులు కల్పించని షాపులపై కఠిన చర్యలు తీసుకున్నారు. కొన్నింటిని సీజ్ చేసి, కొన్నింటికి జరిమానాలు వేశారు.

mehdipatnam.

ఖైరతాబాద్  జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. ట్రెడ్  లైసెన్స్ లేకుండా ప్యాపారం చేస్తున్న చెన్నై సిల్క్స్విజయ నగర్ కాలనీ సమీపంలోని ఎం.ఎం.డీ.సీ  వద్ద ఉన్న సూపర్ మార్కెట్ ను సీజ్ చేశారు.  సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడుతున్న ఆర్.ఎస్. బ్రదర్స్‌ను కూడా సీజ్ చేశారు. మాసాబ్ ట్యాంక్ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించకుండా నిర్వహిస్తున్న మోర్ సూపర్ మార్కెట్‌కు 25 వేల రూపాయల జరిమానా విధించారు. తనిఖీల్లో  మెదీపట్నం డిప్యూటీ కమిషనర్ ఇంకెశాఫ్ అలీమెడికల్ ఆఫీసర్ బజాజ్ కాసీఎం తదితరులు పాల్గొన్నారు.