పోలింగ్‌ లైవ్‌వెబ్ కాస్టింగ్.. యువతకు ఆహ్వానం - MicTv.in - Telugu News
mictv telugu

పోలింగ్‌ లైవ్‌వెబ్ కాస్టింగ్.. యువతకు ఆహ్వానం

March 16, 2019

త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నిక‌ల్లో భాగంగా ఏప్రిల్ 11వ‌ తేదీన జ‌రిగే మొదటి దశ పోలింగ్‌ను లైవ్‌వెబ్ కాస్టింగ్ చేయ‌డానికి ఆస‌క్తి ఉన్న‌వారని జీహెచ్ఎంసీ ఆహ్వానిస్తుంది. ఆసక్తి ఉన్నవారు త‌మ పేర్ల‌ను https://bit.ly/webcat-2019 అనే వెబ్‌సైట్ ద్వారా గాని లేదా మైజీహెచ్ఎంసీ మొబైల్ అప్లికేషన్ ద్వారా గాని న‌మోదు చేసుకోవాల‌ని జీహెచ్ఎంసీ ఐటీ విభాగం అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ సిక్తా ప‌ట్నాయ‌క్ తెలిపారు. ఈ వెబ్‌కాస్టింగ్‌లో పాల్గొన‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రిచే అభ్య‌ర్థులు ముఖ్యంగా సీనియ‌ర్‌ ఇంజ‌నీరింగ్ విద్యార్థులు జీహెచ్ఎంసీలో త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాల‌ని తెలిపారు. సొంత ల్యాప్‌టాప్‌ క‌లిగిన అభ్య‌ర్థులు [email protected] అనే మెయిల్‌కు సంప్ర‌దించాల‌ని కోరారు. ఎన్నిక‌ల వెబ్‌కాస్టింగ్ విధుల్లో పాల్గొనే వారికి త‌గు పారితోషికం ఇవ్వ‌డంతో పాటు స‌ర్టిఫికేట్ జారీచేయ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు.

Ghmc seeking applications for lok sabha polling live webcasting