GHMC staff watering the plants during the rain
mictv telugu

జోరువానలో జీహెచ్ఎంసీ చేస్తున్న పని వైరల్

July 13, 2022

GHMC staff watering the plants during the rain

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న సంగతి అందరికీ తెలుసు. గతం వారం రోజులుగా ముఖ్యంగా హైదరాబాద్ లో వాన ముసురు కమ్ముకుందని, మరో మూడు రోజులూ అదే పరిస్థితి ఉంటుందని న్యూస్ ఛానెళ్లు పలుసార్లు ప్రసారం చేశాయి. మరోవైపు ప్రభుత్వం కూడా జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా అవసరమైతే తప్ప బయటకు రావొద్దని కూడా హెచ్చరించింది. వాన ముసురు నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించేసింది.

మరీ ఈ సంగతి జీహెచ్ఎంసీ సిబ్బందికి తెలుసో.. లేదంటే పని పట్ల నిబద్ధతగా ఉండాలనుకున్నారో తెలియదు కానీ.. వారి చేసిన పని ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ జోరు వానలు పడుతున్న సమయంలో.. మొక్కలకు నీళ్లు పోస్తూ తమ పనితనం ఏంటో నిరూపించుకున్నారు. జోరు వానలో ఓ ఫ్లై ఓవర్ పక్కన ఉన్న చెట్లూ, మొక్కలకు నీళ్లు పోస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జీహెచ్ఎంసీ వాటర్ ట్యాంక్ తో ఇద్దరు సిబ్బంది చెట్లకు నీళ్లు పడుతుండగా.. ఓ వ్యక్తి వారిని ప్రశ్నించాడు.

ఓ వైపు వర్షం పడుతుండగా నీళ్లు పట్టాల్సిన అవసరం ఏముందని అతను ప్రశ్నించగా.. సిబ్బంది సరైన సమాధానం చెప్పలేకపోయారు. ప్రజాధనం ఇలా దుర్వినియోగం చేస్తున్న జీహెచ్ఎంసీ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.