ఊరంతా ఊడుస్తుంది.. తనదేమో దాచేస్తుంది  - MicTv.in - Telugu News
mictv telugu

ఊరంతా ఊడుస్తుంది.. తనదేమో దాచేస్తుంది 

November 24, 2017

గురివింద గింజ తన నలుపు తాను చూసుకోదని సామెత. హైదరాబాద్ మహానగరాన్ని పొద్దస్తమానం ఊడ్చిపారేస్తున్న జీహెచ్ఎంసీకి ఇది అన్ని విధాలుగా వర్తిస్తుంది. నగర వ్యాప్తంగా చెత్త కనిపించకుండా స్పెషల్ టీం లు ఏర్పాటు చేసింది బల్దియా. ముఖ్యంగా ప్రధాన రోడ్లపై చెత్త కనిపించే చాలు పట్టుకుపోతుంటుంది. అయితే తన ఇంటిని శుభ్రం చేసుకోవడంలో మాత్రం ఘోరంగా చతికిల బడుతుంతోంది.జీహెచ్ఎంసీ ప్రధానా కార్యాయంలో గుట్టలగుట్టల చెత్త పేరుకుపోయింది. దీన్ని బల్దియా చెత్త కార్యాలయంగా మార్చేసింది. భవనంపై రూఫ్ పై గొడుగులా  ఏర్పాటు చేసిన భవనంలో టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయింది. విరిగిపోయిన బల్లలు, కాగితాలు, సంచులు, డబ్బాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది . సిబ్బంది అలసత్వం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇంకో చిత్రమేమంటే.. అంత చెత్తను పైకి తీసుకెళ్లడం. పై అంతస్తుల్లోని సిబ్బంది.. ఆ చెత్తను కిందకి తీసుకెళ్లే ఓపిక లేక కెక్కించారు.