GHMC  దోమ యాప్...! - MicTv.in - Telugu News
mictv telugu

GHMC  దోమ యాప్…!

August 17, 2017

హైద్రాబాద్ నగర మున్సిపల్ సంస్ధ గూగుల్ ప్లేలో మరో యాప్ ను తీస్కచ్చింది,అదే GHMC దోమ యాప్.డెంగ్యూ, మలేరియా లు రాకుంట ఎలాంటి చర్యలు తీస్కోవాలే.దోమలతో కలిగే రోగాలనుంచి ప్రజలు అప్రమత్తంగా ఎలా ఉండాలి, అనేది ఈ యాప్ ద్వారా ప్రజలను చైతన్య పరుస్తరట.

దోమలను నివారించడానికి  ఏంజేస్తే బాగుంటది, మున్సిపల్ వాళ్లు ఎలాంటి  చర్యలు తీస్కోవాలే ఇగో ఇట్ల  దోమలను నివారించడానికి ఏం ఏం జెయ్యాల్నో..మీరేం జేస్తె బాగుంటదో అన్ని వివరాలు ఆ యాప్ ల ఉంటయట.అంతే గాదు ప్రతినెల ఆయాప్ లో మున్సిపాలిటోళ్లు అడిగిని  కొన్ని ప్రశ్రలకు ఎవరైతే కరెక్ట్ జవాబులు రాస్తరో అన్ల 100 మందిని సెలక్ట్ జేశి ఒక్కొక్కరికి 1000 రూపాయల క్యాష్ ప్రైజ్ గుడ ఇస్తరట.