కేరళలో ఘోరం.. నదిలో పడి నవ జంట మృతి - MicTv.in - Telugu News
mictv telugu

కేరళలో ఘోరం.. నదిలో పడి నవ జంట మృతి

April 5, 2022

bbdf c

ప్రతి యువతి, యువకుడికి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. అయితే, గతకొన్ని కొన్ని సంవత్సరాలుగా పెళ్లిలు అన్నీ ఇంటి వాకిలిని వదిలి, ఫంక్షన్ హాల్స్‌లోనే జరుగుతున్నాయి. పెళ్లి చూపులు సక్సెస్ అయిన రోజునుంచి పెళ్లి అయ్యేవరకు వరుడు, వరుని మధ్య ఫోటోషూట్‌లు, ప్రోమో కోసం వీడియోలు తీసుకోవటం ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. అంతేకాకుండా, పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే చేసుకుంటాం కదా.. పెళ్లికి సంబంధించిన ప్రతిది ఓ మధుర గుర్తుగా ఉండిపోవాలని కొత్త కొత్తగా వీడియోలు, వెరైటీ స్టైల్స్‌లో ఫోటోలు తీయించుకుంటున్నారు. ఈ క్రమంలో కేరళ రాష్ట్రంలో ఓ నవ జంట పెళ్లి అయిన తర్వాత ఫోటోషూట్ కోసం వెళ్లి, భార్యభర్తలు నదిలో పడి గల్లంతైన సంఘటన కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. కోజికోడ్ ప్రాంతంలోని కడియంగడ్‌కు చెందిన రెజిల్, కార్తీక మార్చి 14న పెళ్లి చేసుకున్నారు. అయితే, ఫొటో షూట్ కోసం తాజాగా కట్టియాడి నది వద్దకు వచ్చారు. అనంతరం ఎంతో ఆనందంతో నవ జంట ఫొటో షూట్ చేస్తుండగా ఒక్కసారిగా ఇద్దరు నదిలో పడ్డారు. దీంతో ఆ నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయారు. వెంటనే అక్కడున్న స్థానికులు నదిలోకి దూకి.. ఇద్దరినీ ఒడ్డుకు చేర్చారు. అయితే, కొన ఊపిరితో ఉన్న రెజిల్, కార్తీకను ఆసుపత్రికి తరలించగా, దురదృష్టవశాత్తు రెజిల్ అప్పటికే మరణించగా, కార్తీక పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో కడియంగడ్‌‌లోని ఇరుకుటుంబల్లో విషాదం నెలకొంది.