మధ్యప్రదేశ్‌లో ఘోరం.. ఏడుగురు సజీవ దహనం - MicTv.in - Telugu News
mictv telugu

మధ్యప్రదేశ్‌లో ఘోరం.. ఏడుగురు సజీవ దహనం

May 7, 2022

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రెండంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించి, ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..”శనివారం వేకువ జామున నాలుగు, ఐదు గంటల సమయంలో ఇండోర్‌ స్వర్ణ్‌ భాగ్‌ కాలనీలో ఉన్న రెండు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గాఢ నిద్రలో ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా లేచి చూచేసరికి, ప్రమాదం నుంచి తప్పించుకునే వీలు లేకుండాపోవడంతో ఏడుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు” అని పోలీసులు తెలిపారు.

 

సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మూడు గంటలపాటు, శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి కారణం షార్ట్‌ సర్క్యూట్‌ అని అధికారులు భావిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరుపున వారి కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు.