Ghulam Nabi 'Azad' from Congress, blames Rahul Gandhi for exit
mictv telugu

కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ గుడ్‌బై.. రాహుల్ గాంధీ వల్లేనంటూ..

August 26, 2022

 

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుల్లో ఒకరైన గులాం నబీ అజాద్ పార్టీకి రాజీనామా చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులను తీసుకుని రావాల్సిన అవసరం ఉందంటూ కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్న ఆయన.. వారం రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్యం సరిగా లేనందునే రాజీనామా చేశానని ఆనాడు అన్నారు. ఇదంతా జరిగిన పది రోజులకే కాంగ్రెస్తో పూర్తిగా తెగదెంపులు చేసుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు ఆజాద్. తాజాగా పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
రాహుల్‌ గాంధీ సీనియర్ల అందరినీ పక్కన పెట్టేశారని తన రాజీనామా సందర్భంగా గులాం నబీ అజాద్‌ పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీకి రాజకీయ పరిపక్వత లేదని విమర్శలు చేశారు. రాహుల్‌ వైఎస్‌ ప్రెసిడెంట్‌ అయ్యాక.. కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా నాశనం అయిందని ధ్వజమెత్తారు. కాగా జమ్మూ కాశ్మీర్‌ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో.. ఆజాద్‌… రాజీనామా కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద షాక్‌ అనే చెప్పాలి. కాగా కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో పలువురు నాయకులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షేర్ గిల్ పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. రాజీనామా చేయడమే కాదు పార్టీ ఫై తీవ్ర విమర్శలు చేసారు. రాజీనామా లేఖను అధిష్టానికి పంపారు.