డ్రైనేజ్‌లో దొరికిన భారీ ఎలుక.. ఇదీ విషయం! - MicTv.in - Telugu News
mictv telugu

డ్రైనేజ్‌లో దొరికిన భారీ ఎలుక.. ఇదీ విషయం!

September 23, 2020

‘Giant rat’ found in drain under Mexico City

ఎలుక సైజు ఎంత ఉంటుంది? పట్టుకుంటే పిడికెడు చిట్టెలుక. బాగా బలిసింది అయితే పందికొక్కు, పందిపిల్ల సైజులో ఉటుంది. అంతకు మించిన ఎలుకలను మనం చూడలేదు. కానీ, ఓచోట ఓ పెద్ద సైజు ఎలుక డ్రైనేజీలో పడిపోయి చనిపోయింది. ఎలుగుబంటి మాదిరి భారీ సైజులో ఉంది. దానిని చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. ఇంత పెద్ద ఎలుక జనావాసాల్లోకి ఎలా వచ్చింది? అసలు ఇంత పెద్ద సైజులో ఎలుకలు ఉంటాయా? అని రకరకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ ఎలుక డెడ్‌బాడీకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. 

తీరా చూస్తే అది ఎలుక కాదు, బొమ్మ అని తేలింది. దీంతో ప్రజలు డబల్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. దానిని బాగా పరిశీలించి చూశాక అది బొమ్మ అని నిర్ధారించుకుంటున్నారు.  మెక్సికోలో గత కొన్నిరోజులుగా డ్రైనేజీలు బ్లాక్ అవుతున్నాయి. దీంతో మున్సిపాలిటీ సిబ్బంది డ్రైనేజీలను తనిఖీ చేయడం ప్రారంభించింది. డ్రైనేజీ బ్లాక్ అవ్వడానికి గల కారణాన్ని ఎట్టకేలకు కనుగొన్నారు. పెద్ద పరిమాణంలో ఉన్న పెద్ద జీవి కారణంగానే డ్రైనేజీ జామ్ అయిందని తేల్చారు. అది చూడ్డానికి అచ్చం ఎలుకలానే ఉంది. కానీ చనిపోయి ఉంది. అయినా సిబ్బంది కష్టపడి సదరు ఎలుకను బయటకు తీశారు. తీరా దాన్ని నీటితో శుభ్రం చేసి చూసేసరికి సిబ్బంది షాక్ అయ్యారు. హాలోవిన్ నేపథ్యంలో ఎవరో పెద్ద సైజు ఎలుక బొమ్మను తయారు చేసి డ్రైనేజీలో పడేశారని కనుగొన్నారు.