Gidugu Rudraraj has been appointed as the President of AP PCC
mictv telugu

ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా కొత్త నాయకుడు.. పార్టీ రాత మారేనా!

November 23, 2022

Gidugu Rudraraj has been appointed as the President of AP PCC

ఆంధ్రప్రదేవ్ నూతన పీసీసీ చీఫ్ ని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. గత కొంతకాలంగా ఈ దిశగా ఆలోచన చేసిన అధినాయకత్వం కొత్త పీసీసీ చీఫ్ గా పలువురి పేర్లను పరిశీలించి చివరికి గిడుగు రుద్రరాజుని ఖాయం చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడింది. శైలజానాథ్ పనితీరు సరిగా లేకపోవడంతో పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళిలా మారిందనే ఫిర్యాదులు రావడంతో అధ్యక్షుడి మార్పు జరిగింది.

ఇక గిడుగు రుద్రరాజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేవీపీలకు సన్నిహితుడిగా పేరు పొందారు. చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ లోనే పుట్టిపెరిగిన గిడుగు రుద్రరాజుకు పార్టీ కోసం యాక్టివ్ గా పని చేస్తారనే పేరు ఉంది. గతంలో ఎమ్మెల్సీగా పని చేయడంతో పాటు ఏఐసీసీ కార్యదర్శిగా ఒడిషా రాష్ట్ర సహాయ ఇంచార్జ్ బాధ్యతలు నిర్వహించారు. కాగా, ఏపీలో తీసికట్టుగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఈ కొత్త నియామకంతోనైనా పుంజుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.