భారతదేశంలో గిగ్ ఎకానమీ 2029-30 నాటికి 2.35 కోట్ల మంది కార్మికులు పెరుగుతుందని అంచనా వేయబడింది. అయితే వారి సామాజిక భద్రత ఇప్పటికీ పెద్ద ప్రశ్నంగా ఉంది. ఈ వ్యవస్థలో మార్పు కోసం స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ లకు, డిపెండెంట్ లకు ఉచిత అంబులెన్స్ సేవలను అందించడానికి డయల్ 4242తో భాగస్వామ్యం కలిగి ఉంది.మొదటి రకం చర్యలో ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫారమ్ స్విగ్గీ అత్యవసర పరిస్థితుల్లో డెలివరీ ఎగ్జిక్యూటివ్ లు, వారి పై ఆధారపడిన వారి కోసం అంకితమైన అంబులెన్స్ సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. స్విగ్గీ కొత్త సహకారం ద్వారా డెలివరీ ఎగ్జిక్యూటివ్ లు టోల్ ఫ్రీ నంబరును (1800 267 4242) ను సంప్రదించవచ్చు. లేదా అత్యవసర పరిస్థితుల్లో SOS బటన్ ను నొక్కి ఉచిత అంబులెన్స్ సేవను యాక్సెస్ చేయవచ్చు.
కాల్ దూరంలో..
2020-21లో గిగ్ ఎకానమీ 77 లక్షల మంది కార్మికుల నుంచి 2029-30 నాటికి 2.35 కోట్ల మందికి విస్తరిస్తుందని గతంలో ప్రభుత్వ థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. సాంప్రదాయ, ఉద్యోగ పద్ధతికి వెలుపల గిగ్ కార్మికులు పని చేస్తున్నందున వారు సామాజిక భద్రత, గ్రాట్యుటీ, కనీస వేతన రక్షణ, స్థిర పని గంటల పరంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారాన్ని అందిస్తూ, డిజిటల్ మెకానిజమ్ ల ద్వారా కార్మికుల ప్రమాదం, ఇతర బీమాలను అందించే ఇండోనేషియా మోడల్ ను నీతి ఆయోగ్ అధ్యయనం ఉదహరించింది. స్విగ్గీ అదే స్ఫూర్తిని తీసుకొని అంబులెన్స్ సేవలతో ముందుకొచ్చింది. దీనికోసం యాక్టివ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ లు, వారి పై ఆధారపడిన వారందరికీ ఉచిత అంబులెన్స్ సేవను అందించడాని ఆన్ డిమాండ్ కన్వీనియెన్స్ ప్లాట్ ఫారమ్ డయల్ 4242తో భాగస్వామ్యం కలిగి ఉంది.
వివిధ నగరాల్లో..
మెట్రోపాలిటన్ నగరాలైన బెంగళూరు, ఢిల్లీ, ఎన్సీఆర్, హైదరాబాద్, ముంబై, పుణే, కోల్ కత్తాలో పైలెట్ ప్రయోగాలు చేసిన తర్వాత ఈ సేవను ప్రారంభించింది. ట్రయల్ రన్ లో సేవ ప్రతిస్పందన సమయం సగటున 12 నిమిషాలుగా గుర్తించబడింది. అదనంగా అత్యవసర కేసుల తీవ్రత ఆధారంగా డయల్ 4242 సేవలు పంపబడుతాయి. కాబట్టి నివేదించబడిన కేసు ప్రకారం.. బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ నుంచి అడ్వాన్స్డ్డ్ లైఫ్ సపోర్ట్, ఇంటర్ స్టేట్ అంబులెన్స్ ల వరకు వేర్వేరు అంబులెన్స్ లను పంపవచక్చు. ఈ సేవలన్నీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ లకు, వారిపై ఆధారపడిన వారందరికీ ఉచితంగా అందించబడుతాయి. భార్యభర్తలు, ఇద్దరు పిల్లల వరకు బీమా పరిధిలోకి వస్తుంది. బీమా పరిధిలోకి రాని కుటుంబ సభ్యుల కోసం సబ్సిడీ ధరతో అంబులెన్స్ సేవలను కూడా పొందవచ్చు.