నిన్నేమో గొప్ప కవయిత్రిని, ఇప్పుడేమో వేశ్యనా? - MicTv.in - Telugu News
mictv telugu

నిన్నేమో గొప్ప కవయిత్రిని, ఇప్పుడేమో వేశ్యనా?

March 3, 2018

మలయాళ మహిళా పత్రిక ‘గృహలక్ష్మి’ కవర్‌ పేజీపై ఓ బిడ్డకు తన ఎదపై ఆచ్ఛాదన లేకుండా పాలిస్తూ పోజిచ్చి వివాదంలో చిక్కుకున్న నటి, మోడల్, కవయిత్రి గిలు జోసెఫ్ ఎట్టకేలకు స్పందించారు. తానేం తప్పు చేయలేదని, చనుబాలు, ఓపెన్ బ్రెస్ట్ ఫీడింగ్‌పై ప్రజల్లో అవగాహన కోసమే ఆ ఫోటో సెషన్‌లో పాల్గొన్నాని స్పష్టం చేశరు. దీని కోసం ఆ పత్రిక నుంచి నయాపైసా డబ్బు కూడా తీసుకోలేదని తెలిపారు.‘ఈ ఒక్క ఫొటోపై ఇంత అల్లరా? బిడ్డకు అలా పాలివ్వడం తప్పా? డబ్బే తీసుకోనప్పుడు అది పబ్లిక్ స్టంట్ ఎలా అవుతుంది?  జనం పత్రికలు, టీవీల్ వచ్చే గ్రాఫిక్ ఫొటోలను, బీభత్సమైన, అశ్లీలమైన చిత్రాలను ఇష్టపడుతున్నారు. పచ్చి బూతు వీడియోలు చూస్తున్నారు. అలాంటిది మాతృత్వ గొప్పతనాన్ని చెప్పే ఈ ఫొటోనే వారికి ఇబ్బంది కలిగించిందా? నిన్నటి వరకు నన్ను గొప్ప కవయిత్రి అని పొడిగిన వారే ఇప్పుడు నన్ను వేశ్య అని తిడుతున్నారు? ఆదేం న్యాయం?’ అని గిలు ప్రశ్నించింది. తల్లిపాల ఆవశ్యకతను వివరించడానికే తాను ఇలా చేశానని వివరించారు.