అల్లం నారాయణకు సతీవియోగం..కేసీఆర్‌ పరామర్శ - MicTv.in - Telugu News
mictv telugu

అల్లం నారాయణకు సతీవియోగం..కేసీఆర్‌ పరామర్శ

February 22, 2022

 16

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ సతీమణి పద్మ కన్నుమూశారు. అనారోగ్యం కారణాలతో గతకొన్ని రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కేసీఆర్ ఆమె మరణంపై సంతాపం ప్రకటించారు. అల్లం నారాయణకు ఫోన్‌ చేసి పరామర్శించి, ఓదార్చారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో అల్లం పద్మ సేవలను గుర్తు చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అంతేకాకుండా పద్మ మృతికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె పోషించిన పాత్రను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. అల్లం నారాయణ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.